కేటీఆర్ బర్త్ డే…ఇళ్లు కట్టించిన ఎమ్మెల్సీ పురాణం

145
mlc sathish

మంత్రి కేటీఆర్‌ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుండగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నిరుపేద వృద్ధ దంపతులకు ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ ఇంటిని నిర్మించి ఇచ్చారు.

మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన వృద్ధ దంపతులు రాగం మల్లయ్య, పోసక్కల చేత గృహ ప్రవేశం చేయించారు. మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజును ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా జరుపుకుంటూ సేవా కార్యక్రమాలను నిర్వహించడం సంతోషంగా ఉందని పురాణం సతీష్‌ అన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాన్నాని చెప్పారు.