టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజతం

85
meera bhai

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ చేసింది. వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను మహిళల 49 కిలోల విభాగంలో రజత పకతం సాధించింది. స్నాచ్‌లో 87 కిలోలు ఎత్తిన మీరాబాయి క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు ఎత్తింది. మొత్తంగా 202 కిలోలు ఎత్తి పతకాన్ని సాధించింది. మీరాబాయి చాను తొలి పతకాన్ని అందించడంతో భారత ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పలవురు సినీ, రాజకీయ ప్రముఖులు మీరాబాయికి అభినందనలు తెలియజేశారు.

2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి త‌ర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇండియాకు మెడ‌ల్ సాధించిపెట్టిన అథ్లెట్‌గా మీరాబాయ్ నిలిచింది.