ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్…

324
mlc elections
- Advertisement -

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రంగారెడ్డి,వరంగల్,నల్గొండ మూడు జిల్లాల స్ధానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుండి మే 14 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు.ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వరంగల్, నల్గొండ, రంగారెడ్డి కలెక్టర్లు వ్యవహరించనున్నారు.

ఉపసంహరణకు 17వ తేదీ వరకు గడవు ఉంటుంది. మే 31 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. జూన్‌ 3న ఓట్లను లెక్కిస్తారు. పట్నం నరేందర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో మండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వరంగల్ ఎమ్మెల్సీ స్ధానానికి కొండా మురళి రాజీనామా చేయడంతో ఆ స్ధానానికి ఎన్నిక అనివార్యమైంది.

ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం జూలై రెండు వరకు ఉంది. దీంతో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో వారు ఓటు వేయడానికి అర్హులు. కొత్తగా ఎన్నికయ్యే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ఈ ఎన్నికల్లో ఓటేసే అవకాశం ఉండదు.

- Advertisement -