నిజమైన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. తనపై నమ్మకంతో రైతు సమన్వయ సమితి బాధ్యతలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దేశంలో రైతులకు సాయం చేయాలని ఆలోచించిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. రైతుల గోస చూసిన సీఎం కేసీఆర్ ఉచితంగా నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందిస్తున్నారు.
రైతులకు సమయానికి విత్తనాలు, ఎరువులు అందించారు. మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువులను బాగు చేశారు. రాష్ట్రంలో కోటి 25 లక్షల ఎకరాలకు నీరందించేందుకు.. కృష్ణా, గోదావరిపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని చెప్పారు.
రైతులకు ఎకరాకు రూ. 10 వేల పంట పెట్టుబడి అందిస్తున్నారు. రైతు బీమా ద్వారా గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ. 5 లక్షల సాయం అందుతోంది. క్రాప్ కాలనీల ఏర్పాటు, పంటను మార్కెటింగ్ చేయడంలో..సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు. రైతు సమన్వయ సమితి కార్యకర్తలను సమన్వయ పర్చుకుని పనిచేస్తానన్నారు.