శబరిమల ఆలయం వద్ద ఉద్రిక్తత

241
Shabarimala

శబరిమలలో ఉద్రికత్త నెలకొంది. నేటి నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు అయ్యప్పకు నిత్యపూజలు జరుగనున్న విషయం తెలిసిందే. మహిళలను ఆలయ ప్రవేశానికి అనుమతించరాదని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. శబరిమల వెళ్లిన తెలుగు మహిళలను పోలీసులు అడ్డగించారు. పదిమంది మహిళలను పోలీసులు పంబ నుంచి వెనక్కు పంపారు. పోలీసులు, మహిళలకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.

శబరిమలలో పది నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు ప్రవేశించవచ్చని, పూజలు నిర్వహించవచ్చని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆలయం వద్ద ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కాగా శబరిమలను సందర్శించాలనే మహిళలు కోర్టు ఉత్తర్వులతో వస్తే భద్రత కల్పిస్తామని కేరళ దేవాదాయ మంత్రి కదకంపల్లి సురేంద్రన్‌ స్పష్టం చేశారు.