నేడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథితో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,పార్టీ జనరల్ సెక్రెటరీ భరత్ కుమార్ సమావేశమైయ్యారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ అధ్యక్షుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై చిల్లరగా, వెకిలిగా మాట్లాడటం ఆయనకే చెల్లుతుంది. ప్రచారంలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు. బండి సంజయ్‌ని వెంటనే అరెస్ట్ చేయాలి, ఎన్నికల్లో ప్రచారం చేయకుండా తగు చర్యలు తీసుకోవాలి. ఒక పార్లమెంటు సభ్యుడు అయిన సంజయ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ… మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అవగాహన లేకుండా చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారు. చట్టప్రకారం ఎంపీ సంజయ్‌పై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు..చిల్లర గాళ్లకు ఎంపీగా గెలిపిస్తే ఏమవుతుందో చూస్తున్నామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవ చేశారు.
టీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ భరత్ కుమార్ మాట్లాడుతూ.. మత సామరస్యంగా ఉన్న నగరంలో శాంతిభద్రతల విఘాతం కల్పిస్తున్నారు. ఒసామా బిన్ లాడెన్‌తో పోల్చడం సిగ్గు చేటు. దేశంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇలా మాట్లాడడం ఆయనకే చెల్లుతుంది. బండి సంజయ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలి. బీజేపీ పార్టీ వాళ్లే ఉగ్రవాదులుతో సంబంధం ఉన్న కాశ్మీర్‌లోని పీడీపీ పార్టీతో కలిశారు. పాకిస్తాన్‌కు వెళ్లి జిన్నా విగ్రహానికి పులా దండా వేసి పొగిడింది మీ పార్టీ నాయకులే అని భరత్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే దేశా ద్రోహమా. రైతు బంధు ,రైతు భీమా ఇవ్వడమే దేశ ద్రోహమా.. చిల్లర మల్లార మాటలు మాట్లాడే వారికి తగిన బుద్ధి ప్రజలే చెప్తారు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశామని భరత్ తెలిపారు.