కేంద్రానికి తెలంగాణ తడాఖా చూపిస్తాం- ఎమ్మెల్సీ ప‌ల్లా

41
mlc palla
- Advertisement -

ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ పార్టీ ధర్నా చేయనున్న విషయం తెలిసిందే. ఈధర్న ఏర్పాట్లను రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎంపీ రంజిత్ రెడ్డిలు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 11న ఢిల్లీ మహానగరంలో టిఆర్ఎస్ అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ధర్నా చేయనున్నామని తెలిపారు.

ధాన్యం పండించడం 600% వృద్ధి తెలంగాణలో ఉంది. కేంద్రం వరి ధాన్యం సేకరించాలి.. రైతులు అండగా ఉండేలా టీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నా కొనసాగనుంది. తెలంగాణ రైతులు 300 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండించారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే కక్ష్యతో.. రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తూ.. రైతుల ఉసురు తీస్తున్నారు. ఎఫ్‌సిఐ పంజాబ్, హర్యానా మాదిరిగా తెలంగాణలో ధాన్యం సేకరణ చేయాలి.ఇదే అంశంపై ధర్నా చేస్తున్నాం అని స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, మండలం, జిల్లా కేంద్రంలో ధర్నా చేసాం. ప్రజా ప్రతినిధుల వరకే దీనిని పరిమితం చేయడం జరిగింది. తెలంగాణ ధాన్యం సేకరించాలి.. లేకపోతే కేంద్రం తగిన మూల్యం చెల్లిస్తారు. తెలంగాణ తడాఖా, దమ్ము చూపిస్తాం ధ్వజమెత్తారు. ఈధర్నలో భాగంగా మొత్తం ప్రజాప్రతినిధులు 1500 మంది వరకు అవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుపై 11న చెబుతాం అని అన్నారు. ముఖ్యమంత్రి దిశానిర్ధేశంలోనే ధర్నా జరుగుతుంది.

ఈ ధర్నకు తెలంగాణలో ఎన్నికైన అందరూ ప్రజాప్రతినిధులు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం, క్యాబినెట్ చేస్తున్న పోరాటం ఇది. రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న కార్యక్రమం. 14 ఏళ్ళు కష్టపడితే తెలంగాణ వచ్చింది. పంజాబ్, హర్యానా రైతులు కూడా ఇలాగే పోరాటం చేసి ధాన్యం సేకరించారు అని గుర్తు చేశారు. కేంద్రం చేతిలోనే ఎఫ్‌సిఐ, గోడౌన్ లు, సేకరణ అంశం ఉంది అన్నారు పల్లా.ఇక కాంగ్రెస్‌కు తలా తోక లేదు. వాళ్ళను తిడితే చేతగాని స్థితిలో ఉన్నారు. ఇంక రైతుల పక్షాన ఏంపోరాడుతారు.. అని ఎమ్మెల్పీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎద్దేవ చేశారు.

- Advertisement -