తెలంగాణపై మోదీ మరోసారి విషం కక్కారు- ఎమ్మెల్సీ పల్లా

98
- Advertisement -

ఈ రోజు ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా పీఎం మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. మరోసారి ప్రధాని మోదీ తెలంగాణపై విషం కక్కారని విమర్శించారు.. తెలంగాణ అభివృద్ది పథంలో ఉన్నా.. ప్రధాని హోదాలో ఉండి మోదీ అబద్దాలు చెప్పడం దురదృష్టకరం అన్నారు..తెలంగాణకు ఒక్క సంస్థను ఇవ్వకుండా అన్యాయం చేశారు. మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్స్ ఎందుకు ఇవ్వలేదని పల్లా రాజ్వేశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ ఐటీఐఆర్‌ను రద్దు చేసిన చరిత్ర మోదీది. ఏడు మండలాలను ఏపీలో కలిపి ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వ సంస్థలను మోదీ అమ్మేస్తున్నారు. లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాలపై భారం మోపుతున్నారు. వృద్ధిలో, తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలను తెలంగాణ సాకుతోంది అని అన్నారు.

పార్లమెంట్ భవనం మూడ నమ్మకం తోనే కూల కొడుతున్నారా?..మోదీ దీనికి సమాధానం చెప్పాలని పల్లా డిమాండ్‌ చేశారు. కొత్త రాష్ట్రం కాబట్టి అవసరాలకు అనుగుణంగా కొత్త సచివాలయం కడుతున్నమని.. అమరుల ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -