తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. అయితే ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలు ఎకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ధృవీకరణ పత్రాలను అందుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున్న ఎగిసిన కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్..సిద్దిపేట జిల్లా మునిగడపలో జన్మించారు. స్వరాష్ట్ర సాధనలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ నిర్వహించిన వేలాది సభలు ర్యాలీల్లో దేశపతి పాల్గొన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌కు ఓఎస్డీగా పనిచేస్తున్నారు.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన కుర్మయ్యగారి నవీన్‌కుమార్… 2019 మేలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ మార్చిలో పదవీకాలం పూర్తవనున్నది. ఆయన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్.. నవీన్‌కుమార్‌కు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు (కూతురు కొడుకు) అయిన చల్లా వెంకట్రామిరెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు గ్రామ ప్రెసిడెంట్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం 2004 నుంచి 2009 వరకు అలంపూర్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నిరుటి డిసెంబర్లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీఆర్ఎస్లో చేరారు. ఈ క్రమంలో చల్లా వెంకట్రామిరెడ్డికి సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు.
ఇవి కూడా చదవండి…