రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

23
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. అయితే తాజాగా దీనిని ఉపసంహరించుకున్నారు.

ఇదే కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో పిటిషన్‌పై విచారణ అవసరం లేకపోవడంతో రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు కవిత తరపు లాయర్లు ప్రకటించారు. పిటిషన్‌ ఉపసంహరణకు జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం అనుమతించిందని వెల్లడించారు. కవిత అరెస్టు అక్రమం అంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుగుతోంది.

Also Read:రోజు ధ్యానం చేస్తే ఎన్ని ఉపయోగాలు!

- Advertisement -