బంగారు బోనం స‌మ‌ర్పించిన‌ ఎమ్మెల్సీ క‌విత..

39
kavitha
- Advertisement -

సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఈ సంద‌ర్భంగా క‌విత అమ్మ‌వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆల‌య అర్చ‌కులు క‌విత‌ను ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు.

అంత‌కు ముందు మోండా మార్కెట్ డివిజ‌న్‌లోని ఆద‌య్య న‌గ‌ర్ లైబ్ర‌రీ నుంచి 2 వేల మంది మ‌హిళ‌ల‌తో ఎమ్మెల్సీ క‌విత‌ ర్యాలీగా బ‌య‌ల్దేరి అమ్మ‌వారి ఆల‌యానికి చేరుకున్నారు. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కుటుంబ స‌భ్యులు, డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీల‌త రెడ్డితో పాటు ప‌లువురు టీఆర్ఎస్ నాయ‌కులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -