భద్రకాళి అమ్మవారి సన్నిధిలో కవిత

12
- Advertisement -

వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ కవిత. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా నేతలతో కలిసి సభా ప్రాంగణం పరిశీలించడానికి వచ్చామని వెల్లడించారు. సభా ప్రాంగణంలో మహిళల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కుంభమేళాను తలపించేలా జరగనుందని చెప్పారు.

ఇక అంతకముందు కాజీపేటకు చేరుకున్న కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కాజీపేట బాపూజి నగర్‌లో గురువారం జాగృతి నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జాగృతి మహిళా కార్యకర్తలు బొట్టు పెట్టి, పుష్పగుచ్చం అందజేసి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

Also Read:ఆపరేషన్ కగార్..మావోలకు దడ!

- Advertisement -