గోలి శ్యామలను అభినందించిన ఎమ్మెల్సీ కవిత..

294
mlc kavitha
- Advertisement -

భారత్ – శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని ఈది రికార్డు సృష్టించిన గోలి శ్యామలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. ఎమ్మెల్సీ కవితను గోలి శ్యామల హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసారు. 30 మైళ్ల పాక్ జలసంధిని ఈదిన ప్రపంచ రెండవ మహిళగా గోలి శ్యామల రికార్డు సృష్టించడం గర్వకారణమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రోల్ మోడల్ అన్నారు గోలి శ్యామల. మధ్య తరగతి కుటుంబానికి చెందిన తనను, ఎమ్మెల్సీ కవిత అన్ని విధాలుగా ప్రోత్సహించారన్న గోలి శ్యామల, తన కలలను సాకారం చేసుకోవడానికి ఆర్థికంగా చేయూతనిచ్చారని తెలిపారు. అంతేకాదు ఎమ్మెల్సీ కవితకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని గోలి శ్యామల పేర్కొన్నారు.

- Advertisement -