MLC Kavitha:సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ

46
- Advertisement -

తెలంగాణ సంప్రదాయం, సామరస్యానికి ప్రతీక బతుకమ్మ అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కవిత. బతుకమ్మ తెలంగాణ ప్రజల జీవితాల్లో విడదీయని భాగమైపోయిందన్నారు.అసమాన సమూహాల మధ్య, భిన్న మనస్తత్వాల మనుషుల మధ్య సామరస్యం, వైవిధ్యం, సృష్టి ధర్మం బోధించే పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు.

Also Read:రేణు దేశాయ్‌ రెండో పెళ్లి అప్పుడే  !

బతుకమ్మ పాటలను గుండెలకు హత్తుకుంటూ, గొంతులకు తీపిదనాన్ని అందిస్తూ, గతించిన తెలుపు నలుపు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ రంగురంగుల పూల మయం చేసే పండుగనే బ‌తుక‌మ్మ‌. పల్లె, పట్టణం, ఊరూ వాడా, వీధి, గుడి, బడి అంతటా పండుగ వాతావరణమే.. అంతా పూల‌మ‌య‌మైపోతోందని చెప్పారు. బ‌తుక‌మ్మను పేర్చుతూ.. ఏమేమి పువ్వొప్పునే గౌర‌మ్మ‌.. ఏమేమి కాయొప్పునే గౌర‌మ్మ అనే పాట‌ను క‌విత ఆల‌పించారు.

- Advertisement -