రామకోటి స్థూపానికి భూమిపూజ చేసిన మంత్రి అల్లోల, ఎమ్మెల్సీ కవిత..

231
MLC Kavitha
- Advertisement -

జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఉత్తర ద్వారం ముందు రూ.90 లక్షల వ్యయంతో నిర్మించనున్న రామకోటి స్తూపానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సుంకే రవి మంగళవారం భూమి పూజ చేశారు.

అంతకుముందు కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సుంకే రవి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన వారికి దేవస్థాన కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

- Advertisement -