‘సర్కారు వారి పాట’ లేటెస్ట్‌ అప్‌డేట్‌..

328
- Advertisement -

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్‌‌కు రెడీ అవుతోంది. మొదటి షెడ్యూల్‌లో చిత్ర షూటింగ్ దుబాయ్ లో చేశారు. అక్కడి ఎడారిలో ఫైట్ సీక్వెన్స్ చేశారు. బ్యాంక్ నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. దుబాయ్ షెడ్యూల్ ఇటీవలే ముగిసింది.

ఇక కొత్త షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్లాలని అనుకున్నారు. కానీ ఆ ప్లాన్ మళ్ళీ దుబాయ్ కు షిఫ్ట్ చేశారు. విసాలు కొందరికి మళ్లి దుబాయ్‌కి రెండవ షెడ్యూల్ షిప్ట్ అయ్యిందని సమాచారం. ఈ రెండవ షెడ్యూల్ ఈ నెల 22 న మొదలు అవ్వుతోంది. ఈ షెడ్యూల్ ఏప్రిల్ 15వరకు అక్కడే జరుగుతుంది. దీంతో ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ చేస్తోంది చిత్రబృందం. ఈ షెడ్యూల్‌లో మహేష్‌తో పాటు హీరోయిన్‌గా చేస్తోన్న కీర్తీ సురేష్ కూడా పాల్గోంటుంది. కీర్తితో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటారని తెలుస్తోంది.

- Advertisement -