సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: ఎమ్మెల్సీ కవిత

194
- Advertisement -

జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా అభివృద్ధికి నిరంతరం తోడ్పాటును అందిస్తున్న నాయకులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా తొలుత జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసి, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జగిత్యాల జిల్లా ప్రజల దశాబ్దాల కల జగిత్యాల మెడికల్ కాలేజీ మంజూరు చేశారని కవిత తెలిపారు.

జగిత్యాల జిల్లాలో మెడికల్, నర్సింగ్ కళాశాలల ఏర్పాటుతో జిల్లా ఆస్పత్రి స్థాయి, విస్తీర్ణం, పడకల సామర్థ్యం మరియు ఇతర సదుపాయాలు పెరగనున్నాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో కొత్తగా 6 మెడిక‌ల్ క‌ళాశాల‌లు అనుబంధంగా న‌ర్సింగ్ క‌ళాశాల‌లు, 12 ప్రాంతీయ ఔష‌ధ ఉప కేంద్రాలు, 40 ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఆక్సిజ‌న్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాల‌ని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడంపట్ల సర్వత్రా హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -