అరవింద్‌కు వార్నింగ్ ఇచ్చిన కవిత

50
- Advertisement -

ఎంపీ అరవింద్‌కు వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. తనపై చేసిన అవినీతి ఆరోపణల చిట్టా ఉంటే తీసుకురావాలని సవాల్ విసిరారు. ఈ మేరకు అరవింద్‌కు 24 గంటల సమయం ఇచ్చిన కవిత…తన భర్త ను పాలిటిక్స్ లోకి లాగడం సరికాదన్నారు. అరవింద్ ఎక్కడ నిలబడితే నేను అక్కడికి వెళ్లి ప్రచారం చేసి ఓడిస్తానన్నారు.

ఐ టి హబ్ 29 న ప్రారంభంకానుందని…ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ వస్తున్నారని చెప్పారు. బీజేపీ , కాంగ్రెస్ లు తలకు మాసిన రాజకీయం చేస్తున్నారన్నారు.మాకు బీజేపీ కి ఎలాంటి పొత్తు లేదు బీజేపీ తో మాకు పోటీ లేదన్నారు. కాంగ్రెస్‌తోనే మాకు పోటీ ఉందని…జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో తిరుగులేని మెజార్టీతో విజయం సాధిస్తామన్నారు.

Also Read:వరుణ్- లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్!

2014లో టిఆర్ఎస్ గవర్నమెంట్ గురించి ఏమీ తెలియకపోయినా అప్పుడే గెలిపించారు…ఇప్పుడు మనం చేసిన మంచి పనులు ప్రజలకు బాగా తెలుసు అందుకే మనల్ని తెలంగాణ రాష్ట్రంలో భారీ మెజారిటీగా గెలిపిస్తారని సర్వేలో తేలిందన్నారు.గతంలో కంటే ఇంకా భారీ మెజారిటీ వస్తుందని జోస్యం చెప్పారు.

Also Read:కీ అప్‌డేట్ ఇచ్చిన విశ్వక్‌!

- Advertisement -