- Advertisement -
పెద్దపేగు క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో జరిగిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పర్యావరణ హితం కోసం ప్రభుత్వం పార్కులు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసిందన్నారు.
జిల్లా కేంద్రాల్లో పెద్దపేగు క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తామని చెప్పారు. దేశంలోనే హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఉందన్నారు.క్యాన్సర్‌తో యువత ప్రాణాలు కోల్పోవడం బాధకలిగిస్తుందని చెప్పారు. మహిళలు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చిన్న పిల్లలకు కూడా పెద్దపేగు క్యాన్సర్ వస్తుందని… పాశ్చాత్య మాయలో పడి ఆహార నియామాలు పాటించడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
- Advertisement -