MLC Kavitha:కాంగ్రెస్ నేతలు కప్పలు

36
- Advertisement -

బీఆర్ఎస్ నేతలు చెరువులో చేపలాంటోళ్లని…కాంగ్రెస్, బీజేపీ నేతలు అదే చెరువులో కప్పలాంటోళ్లు అన్నారు ఎమ్మెల్సీ కవిత.మెట్ పల్లి మండలం బండాలింగాపూర్ లో రోడ్ షో లో పాల్గొని మాట్లాడిన కవిత.. దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎం కొట్టిన నాయకుడు లేడని…ప్రజల ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ చరిత్ర తిరగరాయబోతున్నారన్నారు.

తెలంగాణ వచ్చాకా ఆంద్రావాళ్లు నవ్వారని..సీఎం కేసీఆర్ వాళ్లకు అభివృద్ధితో బుద్ది చెప్పారన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఎవరైన ఒక రూపాయి ఇచ్చారా..? ఆలోచించాలన్నారు. ఇవాళ రైతు బంధు ద్వారా ఎకరాకు రూ.10 వేల సాయాన్ని అందిస్తున్నామని…వచ్చే ఎన్నికల్లో గెలిస్తే దానిని రూ.16 వేలకు పెంచుతామన్నారు.

దేశంలోని పదహారు, పదిహేడు రాష్ట్రాల్లో బీడి కార్మికులు ఉన్నారు కానీ ఏ ప్రభుత్వం కూడా వారికి పించన్ ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వస్తే బీడి ఫించన్ రూ.3 వేలు అవుతుందని తెలిపారు.గ్యాస్ సిలిండర్‌ని రూ.400లకే అందిస్తామన్నారు. కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ గెలుస్తుంది కానీ బీఆర్ఎస్ ను గెలిపిస్తే ప్రజలందరూ గెలుస్తారు అన్నారు కవిత.

Also Read:యంగ్ బ్యూటీకి టాప్ రెమ్యునరేషన్

- Advertisement -