Kavitha:బీఆర్ఎస్..మన ఇంటి పార్టీ

36
- Advertisement -

BRS పార్టీ మన ఇంటి పార్టీ అని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో బూత్ సభ్యుల సమావేశంలో మాట్లాడిన కవిత…మనది పేగుబంధం…వారిది ఓట్ల బంధం అని దుయ్యబట్టారు. గులాబీ జెండా ఉత్సాహాన్ని బోధన్ ప్రజలు చూపించారని… మనం చేసిన అభివృద్ధిని ప్రజలను వివరించాలన్నారు. గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో ఎమ్మెల్యే షకీల్‌ని గెలిపించాలన్నారు.

తెలంగాణలో ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనం నిర్మిస్తామన్నారు. బోధన్‌లో 10వేల మందికి బీడీ పెంచన్‌ ఇస్తున్నామన్నారు. బోధన్లో 152 చెరువులు బాగుచేసుకున్నాం అన్నారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడన్నారు. నిజామాబాద్‌లో ఐటీ హబ్ ప్రారంభించామన్నారు. త్వరలోనే గూగుల్, ఇన్ఫోసిస్‌ని నిజామాబాద్‌కు తీసుకొస్తామన్నారు.

కాంగ్రెస్,బీజేపీ నేతల మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ. 4వేల పెన్షన్ లేదు కాని తెలంగాణలో ఇస్తామని మాయమాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:KTR:వారంరోజుల్లో తొలివిడత ఇండ్ల పంపీణీ

- Advertisement -