కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజులు వచ్చాయి అన్నారు ఎమ్మెల్సీ కవిత. యాదగిరిగుట్ట గిరి ప్రదర్శన అనంతరం మాట్లాడిన కవిత… యదగిరిగుట్ట ను కేసీఆర్ మహాద్బుతంగా అభివృద్ధి చేశారు అన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి…యదగిరిగుట్ట లో మిగిలిన పనులను పూర్తి చేయాలి..ఉమ్మడి నల్లగొండ అంటేనే చైతన్యానికి మారు పేరు అన్నారు.
కేసీఆర్ నాయకత్వం లో నల్గొండ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది…మిషన్ భగీరథ తో నీళ్లు ఇవ్వడం ద్వారా నల్లగొండ జిల్లాలో జీరో ఫ్లోరైడ్ అని పార్లమెంట్ లో ప్రకటించారు…నల్లగొండ జిల్లాలో కేసీఆర్ చేసిన అద్భుతం అది…. మూసి నది కాలుష్యానికి కారణం కాంగ్రెస్….మూసి నదిని శుద్ధి చేయాలని కేసీఆర్ గారు నడుం బిగించారు… stp ప్లంట్ లను ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు…ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మూసి ని atm గా మార్చుకున్నారు అని ఆరోపించారు.
గ్రామ సభలు గందరగోళం గా మారాయి.. లబ్ధిదారులకు పథకాలు రాకపోవడంతో ప్రజలు ఆగ్రహం గా వున్నారు…ప్రభుత్వం పై తిరుగుబాటు మొదలైంది…అన్ని పథకాల్లో కోతలు పెట్టారు…దాన్యం కొనుగోళ్లు లలో గోల్ మాల్ చేశారు..10 శాతం కూడా దాన్యాన్ని కొనుగోలు చేయలేదు అన్నారు. కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయాలని కుట్ర చేస్తున్నారు… అది ఎవ్వరి వల్ల సాధ్యం కాదు…కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజులు వచ్చాయి.. పెన్షన్ లు పెంచలేదు…కాంగ్రెస్ అంటేనే ప్రజలు భయపడుతున్నారు అన్నారు.
Also Read:రెండో రోజు సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు..