కేసీఆర్ ఐఫోన్‌.. రేవంత్ రెడ్డి చైనా ఫోన్‌!

20
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డిపై సంచల నకామెంట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ పాలన ఐఫోన్‌లా ఉంటే.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్‌లా ఉందంటూ మండిపడ్డారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకుని సీఎం రేవంత్ రెడ్డి బూరడి కొట్టారని అన్నారు. తెలంగాణ పోరాటం తరహా మరో పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలన్నారు.

తప్పుడు జనాభా లెక్కలు చెప్పడంతో బీసీ సమాజం అట్టుడుకుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బీసీ కుల సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు కవిత.. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదు..? 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందన్నారు.

Also Read:ఈవారం థియేటర్‌, ఓటీటీ చిత్రాలివే!

ఆడపిల్లలు స్కూటీలు, మహిళలకు 2500 ఏమయ్యాయి..? మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాలం గుణపాఠం చెబుతుంది. రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు అన్నారు. . రేషన్ కార్డులను ఎందుకు జారీ చేయడం లేదు..? రుణ మాఫీ ఎక్కడా కూడా సంపూర్ణంగా కాలేదు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరారు.. ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు.

- Advertisement -