సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రచేస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బొగ్గు గని కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి సింగరేణి వెలుగులు పంచుతోందన్నారు. సింగరేణిలో రాష్ట్రానికి 51%,కేంద్రానికి 49% వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోందన్నారు.
బీజేపీ వైఖరి సమాఖ్య స్పూర్తికి విరుద్దం అని దుయ్యబట్టిన కవిత…సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి సంస్థ అద్భుతమైన పురోగతితో,దేశంలోని ఇతర సంస్థల కంటే ఎంతో గొప్పగా లాభాలు సాధించిందని చెప్పారు. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల్లో ఉన్నట్టుగా చూపిస్తూ,4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోందన్నారు. సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు.
బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసే వరకూ,కార్మికుల పక్షాన గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని చెప్పారు.