- Advertisement -
వరద సాయంలోనూ బీజేపీ పక్షపాత వైఖరి చూపిస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. 2021-22 సంవత్సరానికి ఆయా రాష్ట్రాలకు కేటాయించిన వరద సాయం నిధుల జాబితాను ఎన్డీఆర్ఎఫ్ రెండు రోజుల క్రితం విడుదల చేసింది. ఇందులో తెలంగాణ పేరు లేకపోవడంపై మండిపడ్డారు కవిత.
హైదరాబాద్ ప్రజలకు వరద సాయం అందించడంలోనూ బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతుందని మండిపడ్డారు. ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపూరిత వైఖరితో మనసు కలచి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
2021-22 లో అనేక రాష్ట్రాలను ఎన్డీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణకు మాత్రం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. వరద బీభత్సంతో అల్లాడిపోయిన తెలంగాణకు రూ.1,350 కోట్ల తక్షణ సాయం, మొత్తం రూ.5 వేల కోట్ల ఎన్డీఆర్‌ఎఫ్ నిధులివ్వాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదు.
- Advertisement -