మృతుల కుటుంబాలను ఆదుకుంటాం- ఎమ్మెల్సీ కవిత

158
mlc kavitha
- Advertisement -

శుక్రవారం నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు పుష్కర ఘాట్ దగ్గర గోదావరి నదిలో పడి ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స్నానానికి గాను నదిలో దిగి దురదృష్టవశాత్తు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

- Advertisement -