పీవీకి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్సీ కవిత..

157
mlc kavitha
- Advertisement -

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్దంతి సందర్బంగా ఘనంగా నివాళి అర్పించారు ఎమ్మెల్సీ కవిత. నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్ వద్ద పీవీ నర్సింహారావు కు ఎమ్మెల్సీ కవితతో పాటు హోమ్ మంత్రి మహమూద్ అలీ,స్పీకర్ పోచారం,మండలి చైర్మన్ గుత్తా,రాజ్యసభ ఎంపీ,పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కేకే తదితరలు నివాళి అర్పించారు.

భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు, పాములపర్తి వేంకట నరసింహారావు. 1921, జూన్ 28న జన్మించిన పీవీ బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి.

ముఖ్యమంత్రిగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నాడు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. నిజానికి భూసంస్కరణల విషయంలో పీవీకి సమకాలీన రాజకీయ నాయకులతో ఉన్న విభేధాల కారణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసివచ్చింది.తెలుగుతో సహా, 17 భాషలలో ధారాళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఆయనది. 2004 డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూశారు.

- Advertisement -