ఇదేనా ప్రజా పాలన : ఎమ్మెల్సీ కవిత

13
- Advertisement -

ఇదేనా ప్రజా పాలన అని ఎక్స్ వేదికగా ప్రశ్రించారు ఎమ్మెల్సీ కవిత. ఒక ఆడబిడ్డ కష్టం చెప్పుకోవడానికి వస్తే, కుటుంబ పెద్దగా సమస్యను పరిష్కరించాల్సిన పోలీసు అధికారి… మానవత్వం మరిచి మహిళపై లాఠీతో దాడి చేయడం అమానుషం అన్నారు.

మహిళ భాగ్యపై దాడి చేసిన సీఐపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధిత మహిళకు సత్వరం న్యాయం చేయాలి.. నిజామాబాద్ జిల్లాకు పూర్తి స్థాయి పోలీస్ కమిషనర్ ను నియమించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా అన్నారు కవిత.

 

Also Read:హరిత ప్రేమికునికి కానుకగా మొక్కలు నాటుదాం

- Advertisement -