రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న తెలంగాణ..

64
- Advertisement -

ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా రెండోరోజు నిరసనలు కొనసాగుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టబొమ్మలను తగలబెడుతూ రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌ విద్యుత్‌ సౌధ వద్ద నిర్వహించిన ధర్నాలో బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు పాల్గొని నిరసన తెలియజేశారు. కాంగ్రెస్‌కు రైతులంటే చిన్నచూపని…నాడు సమైక్యరాష్ట్రంలో రైతులను గోసపుచ్చుకున్నారన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ స్వరాష్ట్రంలో ఇప్పుడిప్పుడే రైతులు బాగుపడుతుంటే ఓర్వలేక అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. ఉచిత విద్యుత్ ఎగనామం పెట్టే కుట్ర చేస్తున్నారని… రైతన్నలకు ఇది పరీక్షా సమయం అన్నారు. కాంగ్రెస్ నేతలు తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఎందుకివ్వట్లేదు అని ప్రశ్నించిన కవిత… తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.3 గంంటల కరెంట్ చాలన్న రేవంత్ ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

Also Read:ఖమ్మంకు అమిత్ షా..

మహబూబ్‌నగర్‌ తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన నిరసనల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. బోయిన్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.

- Advertisement -