హిందూ మతమే జీవితం అంటున్న హీరో

39
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఓ మై గాడ్ 2”. ఈ సినిమా నుంచి టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయగానే.. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ టీజర్ వైరల్ అవుతుంది. ఇక ఈ టీజర్ లో అక్షయ్ కుమార్ డైనమిక్ పర్సనాలిటీతో పరమ శివునిగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో దేవుడు పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తుండటంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. ముఖ్యంగా షూటింగ్‌ ముందు రోజు నుంచే అక్షయ్ కుమార్ మాంసాహారం మానేశాడట.

అలాగే ఈ మూవీలో శివుడి పాత్రలో కనిపించడానికి ఆయన జుట్టు కూడా బాగా పెంచారు. పైగా రోజు ఉదయం శివాలయంకి వెళ్లి ఆ తర్వాత అక్షయ్ కుమార్ సెట్ లో అడుగు పెట్టేవారు. సెట్ లో కూడా శివుని రూపాలను నిత్యం ఎదురుగా పెట్టుకొని.. అక్షయ్ కుమార్ శివుని పాత్రలోకి లీనం అయ్యేవారు. ఓ మై గాడ్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో హిందువుల గొప్పతనాన్ని చెప్పే విధంగా కొన్ని డైలాగ్స్ ను కూడా అక్షయ్ కుమార్ ప్రత్యేకంగా రాయించుకున్నాడని తెలుస్తోంది.

Also Read:రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న తెలంగాణ..

హిందువుల కోసమే అక్షయ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ఆయన సన్నిహితులు తెలిపారు. హిందూ దేవతల అనుగ్రహాన్ని పొందడం ప్రతి ఒక్కరి జీవితం ఆశయంగా ఉండాలనేది అక్షయ్ కుమార్ కోరిక అట. మొత్తమ్మీద అక్షయ్ కుమార్ గురించి తెలిసిన నెటిజన్స్ ‘అతను హిందూ మతాన్ని ఎంత ఆరాధిస్తున్నాడో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు’ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఓ మై గాడ్-2 సినిమా ఆగస్ట్ 11న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

Also Read:భారతీయులకు 71,600 చైనా వీసాలు

- Advertisement -