ఉద్యోగాల్లో వాటా కోసం జాగృతి ధర్నా

11
- Advertisement -

ఉద్యోగ నియామకాల్లో అడబిడ్డలకు అన్యాయం చేసే జీఓ 3 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలకు ఉద్యోగాల్లో 33 % వాటా కల్పించాలని డిమాండ్ చేయనుండగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి భారత జాగృతి నాయకులు , మహిళలు ఇందిరా పార్కు కు తరలి వచ్చారు.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టనున్నారు. జీవో నంబర్‌ 3ను రద్దు చేయాలని డిమాండ్‌ చేయనున్నారు. ఈ జీవో వల్ల ప్రభుత్వ నియామకాల్లో మహిళల రిజర్వేషన్ల అమలులో తీవ్ర అన్యాయం జరుగుతుందని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు జీవో-3 వల్ల జరిగే నష్టం గురించి ధర్నాల్లో వివరించనున్నారు.

Also Read:మార్చి 8న ఉమెన్స్‌ డే ..ఎందుకో తెలుసా..?

- Advertisement -