సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు..

214
mlc kavitha
- Advertisement -

హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆలయానికి చేరుకున్న కవితకు ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా కవిత తెలిపారు. తెలంగాణ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని బాబాను వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం సాయిబాబా ఆలయానికి వచ్చిన ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను ఆలయ కమిటీకి అందజేశారు. భక్తులకు వసతుల కల్పన, ప్రసాదానికి సంబంధించి సాయిబాబా దేవస్థానానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ రావడం గొప్ప విషయమన్నారు.

- Advertisement -