మహేష్ కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్సీ కవిత

286
kavitha
- Advertisement -

కశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లికి చెందిన ఆర్మీ జవాన్‌ ర్యాడ మహేశ్‌(26) వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అమ‌ర జ‌వాను ర్యాడా మ‌హేశ్ కుటుంబానికి తెలంగాణ జాతి అండ‌గా ఉంటుంద‌ని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత తెలిపారు. ట్విట్ట‌ర్ ద్వారా ఆమె స్పందిస్తూ మ‌హేశ్‌కు ఘ‌న నివాళి అర్పించారు.

మహేశ్‌ 2015లో ఆర్మీ జవాన్‌గా విధుల్లో చేరాడు. మహేశ్‌ 6వ తరగతి వరకు వేల్పూర్‌ మండలం కుకునూర్‌ ప్రభుత్వ పాఠశాలలో,7-10వ తరగతి వరకు వేల్పూర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదివారు. బాల్యం నుంచి దేశభక్తి భావాలు ఉన్న మహేశ్‌ ప్రత్యేక ఆసక్తితో ఆర్మీలో చేరారు. మహేశ్‌ ఏడాది క్రితం సుహాసినిని ప్రేమవివాహం చేసుకున్నాడు.

- Advertisement -