జవాన్ కళ్యాణ్ రావు మృతి పట్ల ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి

37
jawan

నిజామాబాద్ జిల్లాకు చెందిన సైనికుడు దాదన్నగారి కళ్యాణ్ రావు (25) ఆకస్మిక మరణంపై ఎమ్మెల్సీ ‌కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కళ్యాణ్ రావు ప్రమాదవశాత్తు మరణించడం కలచివేదిందన్న ఎమ్మెల్సీ కవిత, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కళ్యాణ్ రావు‌ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

మక్లూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దాదన్నగారి కళ్యాణ్ రావు (25) గత ఆరేళ్ల నుండి ‌సైన్యంలో సేవలందిస్తున్నాడు. ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్న కళ్యాణరావు మంగళవారం పంజాబ్ రాష్ట్రంలోని పట్టిండా ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా చెట్టు పై నుంచి పడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.