- Advertisement -
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లును వాపస్ తీసుకోవాలని చేపట్టిన భారత్ బంద్ తెలంగాణలో సక్సెస్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టాయి.
కామారెడ్డి జిల్లా టెక్రియల్ చౌరస్తా వద్ద నిర్వహించిన రైతుల ధర్నాలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ కవిత..కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బ్లాక్ బెలూన్స్‌ను గాల్లోకి వదిలేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
- Advertisement -