కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఉన్న పరిస్థితి ఇది అని ఎక్స్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు ఎమ్మెల్సీ కవిత. స్వీపింగ్ మరియు శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు ప్రతి నెల బీఆర్ఎస్ ప్రభుత్వం రూ . 40,000 కేటాయిస్తే నలుగురు తాత్కాలిక ఉద్యోగులు పనిచేసేవారు. వీరు టాయిలెట్లు మరియు తరగతి గదులు శుభ్రం చేసేవారు. గత సంవత్సరం ఆగస్టు నెల నుండి ఈ పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించినందున పిల్లలే టాయిలెట్లు, గదులు మాత్రమే కాకుండా పాఠశాల హాస్టల్ ఆవరణలోని బయటి పనులు అన్ని కూడా విద్యార్థులే రెగ్యులర్ గా చేసుకోవాలని చెప్పారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు గురుకుల పాఠశాల లోని వాచ్ మెన్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్రంలోని 240 గురుకుల విద్యా సంస్థలలో అసిస్టెంట్ కేర్ టేకర్ లను తొలగించి వారు చేసే వార్డెన్ పనులను పిల్లలతో చేయించాలని చెప్తున్నారు. ఇప్పటివరకు వార్డెన్లే అన్ని రకాల నిర్వహణలు చూసుకున్నా పిల్లలు కమిటీగా ఏర్పడి క్వాలిటీ చెక్ చేసుకునేవారు. కానీ ఇకపై పిల్లలే వంటశాల నిర్వహణ మరియు మెస్ పనులు కూడా చేయవలసి వస్తుంది.
Dignity of labour ( శ్రమను గౌరవించడం) నేర్పడం వేరు, విద్యార్థులతో వెట్టిచాకిరి చేయించడం వేరు. అసలు మొత్తంగా శానిటేషన్ వర్కర్స్ ను తొలగించి ఆ పనులు పిల్లలతో రెగ్యులర్ గా చేయించడం నేరం. ఇక్కడ ఆడియోలో వర్షిని గారు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. బోర్డు తుడవడం టాయిలెట్ కడగడం ఒకటి కాదు. మేడం గారి పిల్లలు చదువుకునే చోట అందరూ వాడే టాయిలెట్లను వీరు క్లీన్ చేయగలరా. అది కూడా రెగ్యులర్ గా.
సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో చదివే పిల్లలు ఏమైనా పోష్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చారా? వెళ్లి కూర్చోగానే టేబుల్ పైకి ఫుడ్ రాదు అనడం.. ఎందుకు ఇలాంటి పనులు చేయరు చేయాల్సిందే అని ఒక ఐఏఎస్ అనడం దుర్మార్గం. ఈ వివక్షల నుండి తప్పించడానికే కదా ఈ పిల్లలకు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఏర్పాటు చేయించి చదివించేది. ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పడం కాదు. కుల వివక్ష మరియు శ్రమ దోపిడీ మాత్రమే.
Also Read:TVKలోకి మాజీ ఐఆర్ఎస్ అధికారి!
దీంతో పాటు 240 మంది అసిస్టెంట్ కేర్ టేకర్ లను తొలగించడం కూడా. గతంలో లాగానే పిల్లలు క్వాలిటీ మాత్రమే తనిఖి చేసుకునే ఏర్పాటు ఉండాలి. అంతే కానీ పిల్లలతో పూర్తిస్థాయి వార్డెన్ మరియు శానిటేషన్ వర్కర్స్ చేయించే పని చేయించడం కరెక్ట్ కాదు అని మండిపడ్డారు.
నలుగురు శానిటేషన్ వర్కర్స్ ఒక వార్డెన్ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాలలో కలిపి 1200 మంది ఉద్యోగులను తొలగించడం అన్యాయం. ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పడం మరోవైపు అత్యవసరమైన చోట వారిని తొలగించి ఆ పని భారం విద్యార్థుల మీద ఉంచడం తప్పు.
పోష్ పిల్లలు కాకపోయినా అందరూ పిల్లలు సమాజం దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో సమానమే అన్న సంకేతాలను పంపాల్సిన గురుకుల పాఠశాలలు వివక్ష కేంద్రాలుగా మారకూడదు. ఎస్సీ వర్గాల పిల్లలు ప్రధానంగా చదివే గురుకుల పాఠశాలలో ఈ నిర్ణయం మానవతావాదులు ముక్తకంఠంతో ఖండించవలసింది.
కాంగ్రెస్ ప్రభుత్వ పేదల వ్యతిరేక ఆలోచన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, తక్షణమే ఆ అధికారిని తప్పించాలి, నెలకు మెయింటెనెన్సు డబ్బులు పాఠశాలలకు ఇవ్వాలి. పిల్లలతో పనిచేయించటం ఆపివేయాలి అని డిమాండ్ చేశారు కవిత.
Congress government’s anti-poor attitude is reflected in this shocking behaviour by an official, at Social Welfare Gurukul Society.
The evidence of which is available in the audio clip !!
Each social welfare school was granted Rs 40,000 per month during the BRS rule for hiring… pic.twitter.com/pxpHZUXGjU
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 28, 2025
Also Read:TVKలోకి మాజీ ఐఆర్ఎస్ అధికారి!

