ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల ఆకలి కేకలు!

6
- Advertisement -

ఇందిరమ్మ రాజ్యంలో ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల ఆకలి కేకలు పెడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక, పింఛన్ అందక పూట గడవడానికే 16 వేల కార్మిక కుటుంబాలు అవస్థలు పడుతోన్నాయని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంస్థ లాభాల్లో ఉందని చెప్తూ ఇన్నాళ్లూ సంస్థ కోసం శ్రమించిన కార్మికులను పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. పెండింగ్ బకాయిలు, పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన కార్మికులు.. పెండింగ్ ప్రయోజనాలను ఎప్పుడు ఇస్తారో కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పడం లేదన్నారు.

ప్రభుత్వం, అధికారుల తీరుతో విసిగిపోయి ఇకనుంచి ప్రతి సోమవారం నిరసన తెలపాలని నిర్ణయం తీసుకోవడం ఈ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎత్తి చూపుతోంది..పెన్షన్ సదుపాయమే లేకుండా ఉద్యోగంలో చేరి తక్కువ వేతనాలతో పని చేసిన శ్రామిక్, డ్రైవర్, కండక్టర్ క్యాడర్ కార్మికుల పరిస్థితి మరింత ఘోరంగా ఉందన్నారు.16 వేల మంది కార్మిక కుటుంబాలకు ఇకనైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలి, వెంటనే పింఛన్లు మంజూరు చేయాలి అని డిమాండ్ చేశారు.

Also Read:నిండుకుండ‌లా నాగార్జునసాగర్

- Advertisement -