బీసీ రిజర్వేషన్లకై జులై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్‌రోకో కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలో తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత..ఢిల్లీకి బిల్లు పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీసీ బిల్లు గురించి ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. రఘునందన్ రావు బీసీల కోసం ఎందుకు మాట్లాడడం లేదు..? చెప్పాలన్నారు.
బీసీ రిజర్వేషన్లపై బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి చేస్తామని.. ఢిల్లీ పాలకులకు తెలంగాణ బీసీల పౌరుషం ఏంటో చూపిస్తాం అన్నారు. ఢిల్లీ పాలనకు సెగ తాకేలా రైల్ రోకో ఉంటుంది. 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించనివ్వబోవం అని తేల్చిచెప్పారు. 42 రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తుంది. బీసీ విద్యార్థులు, మహిళలు ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున కలిసిరావాలి అని పిలుపునిచ్చారు.
సమాజంలో 56 శాతం జనాభాకు సంబంధించి హక్కులు కోరుతుంటే అవి మానవ హక్కులు కావా..? ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది.. కాబట్టి అందరూ కలిసికట్టుగా హక్కల కోసం పోరాటం చేయాలి అన్నారు.
Also Read:హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం

