- Advertisement -
ఆపరేషన్ సిందూర్‌పై స్పందించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను స్వాగతిస్తున్నాను అని తెలిపారు. పహల్గాంలో సామాన్య ప్రజల పైన ఉగ్రవాదులు చేసిన దాడికి, పుల్వామా దాడికి, ప్రతీకార చర్యగా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల పైన భారత సైన్యం చేసిన దాడిని అభినందిస్తున్నాను అన్నారు.
ఇలాంటి సమయంలో పార్టీలకు అతీతంగా మన ఐక్యతను చాటాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. భారత సైన్యానికి మనమంతా అండగా నిలబడాలి అని పేర్కొన్నారు కవిత.
Also Read:Retro:రూ.100 కోట్ల క్లబ్‌లో ‘రెట్రో’
- Advertisement -

