పాడి కౌశిక్ రెడ్డి ఏసీపీకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని బంజారాహిల్స్ స్టేషన్ కు వెళ్లారు అన్నారు ఎమ్మెల్సీ కవిత. అక్కడ ఏసీపీ లేకపోవడంతో సీఐను ఫిర్యాదు తీసుకోవాలని పాడి కౌశిక్ రెడ్డి కోరారు అన్నారు. సిఐని ప్రశ్నించినందుకు పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టార…ఉదయం 10 గంటలకు అరెస్టు చేస్తే ఇప్పటి వరకు రిమాండ్ చేయలేదు అన్నారు.
పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళినందుకు హరీష్ రావు జగదీష్ రెడ్డి,ఇతర నేతలను అరెస్టు చేశారు…ఫిర్యాదు తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి లేదు అన్నారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుంది…పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు ఉపసంహరణ చేయాలన్నారు.
ఎమ్మెల్యేలను కోర్టు మూసిన తర్వాత పంపించాలనే జాప్యం చేస్తున్నారు…ఇందిరమ్మ రాజ్యం కాదు పోలీసుల రాజ్యం నడుస్తుందన్నారు కవిత. ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీని తలపిస్తుందని..అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలన్నారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read:Kavitha: ఇది ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన