- Advertisement -
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసంలో యూపీఎఫ్ నాయకులు, 72 కులాల ప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత సమావేశం అయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు సబ్ కోటా కల్పించాలి అని డిమాండ్ చేశారు కవిత.
గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ వేయకుంటే ఎవరైనా కోర్టులో అడ్డుకునే ప్రమాదం ఉంది అని తెలిపారు. ఆ అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.
రిజర్వేషన్లను పెంచుతూ చట్ట సవరణ చేసే అధికారం కేంద్రానికి ఉంటే.. ఉన్న రిజర్వేషన్లలో సబ్ కేటగరైజేషన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్పారు. రాజకీయ అవకాశాలు దక్కని కులాల నుంచి సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్ లు కావాలంటే సబ్ కేటగరైజేషన్ ఒక్కటే మార్గం అన్నారు.
Also Read:TBGKS ఇంఛార్జిగా కొప్పుల ఈశ్వర్
- Advertisement -

