బాన్సువాడలో ఎగిరేది గులాబీ జెండానే అన్నారు ఎమ్మెల్సీ కవిత. బాన్సువాడ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన కవిత…బాన్సువాడను బంగారు వాడగా మార్చింది కేసీఆర్ అన్నారు. బాన్సువాడకు 12,000 కోట్ల నిధులు ఇచ్చింది కేసీఆర్..బాన్సువాడకు 9000 ఇండ్లను ఇచ్చింది కేసీఆర్ అన్నారు. బాన్సువాడలో అడుగడుగున సిసి రోడ్లు వేయించింది కేసీఆర్…అనేక కార్యక్రమాలను కెసిఆర్ బాన్సువాడలో చేశారు అన్నారు.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడు రాని నిధుల వరదను పారిచ్చింది కేసీఆర్…కెసిఆర్ ఇచ్చిన నిధులను ముందల పెట్టుకుని అనేక ఎన్నికల్లో పోచారం గెలిచారు అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అనేక పదవులను ఇచ్చింది..అనేక నిధులను ఇచ్చింది, మంత్రిని చేసింది, స్పీకర్ ను చేసింది పార్టీ అన్నారు. పార్టీ గౌరవించింది ..ఆ గౌరవాన్ని పోచారం కాపాడుకుంటే బాగుండేది అన్నారు.
రెక్కలు వచ్చాక తల్లిని వదిలేసిన బిడ్డలాగా..గెలిచి కష్టాలలో పార్టీ ఉంటే అధికారం కోల్పోయిన వెంటనే పార్టీ మారిండు..ఇది తల్లి పాలు తాగి రొమ్మును గుద్దడమే.పార్టీ అంటే కన్నతల్లి లాంటిది అన్నారు. కష్టాలలో పార్టీ ఉంటే బాధ్యతను, బరువును తప్పించుకొని పోచారం పార్టీ మారారు..పోచారంనుమంచి మంచి మనస్సు తో మనం క్షమించిన తెలంగాణ చరిత్ర క్షమించదు అన్నారు. అలాంటి వారికి కచ్చితంగా మనం బుద్ధి చెప్పాలి…లోకల్ బాడీ ఎన్నికలలో బాన్సువాడ లో మన శక్తిని ప్రదర్శించాలి అన్నారు.
బాన్సువాడలో లో త్వరలో పర్యటిస్తాను…అతి త్వరలో ఒక కార్యక్రమం పెట్టుకుందాం అన్నారు. బాన్సువాడ లో ఉన్న అందరి నాయకులను కలుద్దాం…బాన్సువాడలో ప్రతి గడపను, ప్రతి గుండెను తడదాం వారికి ధైర్యాన్ని ఇద్దాం…ఎమ్మెల్సీగా ఉన్న కాబట్టి బాన్సువాడకు నేనొస్తే నన్నెవరూ ఆపలేరు ప్రోటోకాల్ ఉంటుందన్నారు. ధైర్యంగా పనిచేయండి, జనవరి మాసంలో బాన్సువాడలో ఓ పోగ్రామ్ ప్లాన్ చేయండి నేను వస్తాను..ఓ చెల్లెగా, అక్కగా నీతో పాటు అడుగులో అడుగునై నడుస్తాను,భయపడే అవసరం లేదు. భయపడితే తెలంగాణ వచ్చేది కాదు అన్నారు.
Also Read:పోలీసులే ధర్నా చేసే పరిస్థితి వచ్చింది:ఆర్‌ఎస్పీ