జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతిష్టించాలని భారత జాగృతి తరఫున స్పీకర్ కి వినతి పత్రం ఇచ్చాం అన్నారు ఎమ్మెల్సీ కవిత. హైదర్ గూడలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో స్పీకర్ ని కలిశారు కవిత. ఏప్రిల్ 11వ తేదీ లోపు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది.. ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు. గతంలో భారత జాగృతి పోరాటంతో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని…
దేశంలో అత్యధిక జనాభా ఉన్న బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్నారు.
ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన భారత జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తాం అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం అని…ఈ సందర్భంగా ఆయన అనారోగ్యానికి గురవడంతో ఆయన్ని పరామర్శించి వినతిపత్రం అందజేశాం అన్నారు.
Also Read:షర్మిల యాక్షన్ ప్లాన్.. షురూ ?