హ్యాండ్‌బాల్ పోటీలకు అతిథిగా క‌విత‌కు ఆహ్వానం..

102
MLC Kavitha

వ‌చ్చే నెల‌లో ప్రారంభ‌మ‌వ‌నున్న హ్యాండ్‌బాల్ ప్రీమియ‌ర్‌ లీగ్ (హెచ్‌పీఎల్‌) కు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను హ్యాండ్‌బాల్ జాతీయ స‌మాఖ్య అధ్య‌క్షుడు అరిశెన‌ప‌ల్లి జ‌గ‌న్మోహ‌న్‌ రావు ఆహ్వానించారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని క‌విత నివాసంలో జ‌గ‌న్మోహ‌న్‌ రావు ఆమెను మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు. రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి హ్యాండ్‌బాల్‌ను ఏవిధంగా అభివృద్ధి చేయ‌నున్నారో ఆమెకు జ‌గ‌న్మోహ‌న్‌రావు వివ‌రించారు.

హెచ్‌పీఎల్‌లో ప్ర‌తిభ‌గ‌ల‌ స్థానిక యువ ఆట‌గాళ్ల‌కు పెద్ద‌పీట వేశామ‌ని తెలియ‌జేశారు. హైద‌రాబాద్ వేదిక‌గా భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని క్రీడా పోటీల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఈ భేటిలో ఆయ‌న ప్ర‌స్థావించారు. జ‌గ‌న్మోహ‌న్‌ రావు చెప్పిన విష‌యాల‌ను సావ‌ధానంగా విన్న క‌విత ప్ర‌భుత్వం త‌ర‌ఫున క్రీడల అభివృద్ధికి అన్ని ర‌కాలుగా ముందుంటామ‌ని హామి ఇచ్చారు. అలానే రాజ‌స్థాన్‌లో జ‌ర‌గ‌నున్న పీహెచ్ఎల్ తొలి సీజ‌న్ పోటీల‌ను వీక్షించేందుకు త‌ప్ప‌నిస‌రిగా వ‌స్తాన‌ని క‌విత తెలిపారు.