బ్రాహ్మణుల సంక్షేమానికి TRS ప్రభుత్వం కృషి: కవిత

166
kavitha mlc
- Advertisement -

హైదరాబాద్‌లో అరవై ఏండ్లలో ఎవ్వరూ చెయ్యని డెవలప్ మెంట్ ను, ఆరేండ్లలోనే సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అడిక్ మెట్ డివిజన్‌లో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరేండ్లలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిందని ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా గుర్తుచేశారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం 14 వేద పాఠశాలలకు అన్ని రకాలుగా సహాయం అందిస్తోందని తెలిపారు. గత ఆరేండ్లలో 250 కోట్ల రూపాయలతో 2000 కు పైగా దేవాలయాలను పునురుద్దరించినట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. యాదాద్రి యాదాద్రి ఆలయ నిర్మాణం, భద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కోట్లు ఖర్చు పెడుతోందన్నారు ఎమ్మెల్సీ కవిత.

తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు ఉండదని, కంపెనీలు వెళ్తాయని, రకరకాల ప్రచారాలు చేసారన్న ఎమ్మెల్సీ కవిత.. సీఎం కేసీఆర్ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. గతంలో ఎవ్వరూ చేయని విధంగా హైదరాబాద్ లో 24 గంటల పాటు కరెంటు అందిస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాలందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేయూతనిస్తోందన్న ఎమ్మెల్సీ కవిత..ఓవర్సీస్ విద్యా పథకం ద్వారా పేద బ్రాహ్మణ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తోందన్నారు.

మరోవైపు ఎన్నికలు వచ్చిన ప్రతీసారి బీజేపీ అబద్దాలు ప్రచారం చేస్తోందన్న ఎమ్మెల్సీ కవిత.. అబద్దాలకు మోసయేంత అమాయకులు తెలంగాణ ప్రజలు కాదన్నారు. గతంలో తెలంగాణలోని 7 మండలాలను, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీ లో కలిపిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అంతేకాదు గత ఆరేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క విషయంలో కూడా తెలంగాణకు న్యాయం చేయలేదన్నారు.

గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లను గెలిచామని, ఈసారి సెంచరీ చేయడం ఖాయమన్నారు ఎమ్మెల్సీ కవిత. అడిక్ మెట్ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి హేమలతారెడ్డిని ఆశీర్వదించాలని, భారీ మెజారిటీతో కార్పోరేటర్‌గా గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ నేత దేవీప్రసాద్, బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -