TRS ప్రభుత్వ కృషి వల్లే హైదరాబాద్‌లో వ్యాపార అభివృద్ధి: కవిత

207
kavitha mlc
- Advertisement -

గత ఆరేండ్లలో హైదరాబాద్ లో వ్యాపార రంగం ఎంతో వృద్ధి చెందిందన్నారు‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గాంధీ నగర్ డివిజన్ లో జరిగిన ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, 2014 లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 24 గంటల కరెంటు అందించడంతో వ్యాపారస్తులకు సైతం ఎంతో ‌మేలు‌ జరిగిందన్నారు. అంతేకాదు ఆర్య వైశ్య సామాజిక వర్గం లోని పేదవారికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

గత ఆరేండ్లుగా హైదరాబాద్ లో రూ. 67 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినా, కేంద్రం నుండి ‌ఎలాంటి సహకారం లేదన్నారు. గత ఆరేండ్లుగా హైదరాబాద్ లో ఎంతో ప్రశాంతముగా వాతావరణం నెలకొందన్న ఎమ్మెల్సీ కవిత, ఇప్పుడు బీజేపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలతో హైదరాబాద్ కు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ లో శాంతి ‌భద్రతలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న ఎమ్మెల్సీ కవిత, మర్సర్ అనే అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్ ను దేశంలో అత్యుత్తమ జీవన ప్రమాణాలు గల నగరంగా ప్రకటించిన విషయాన్ని గుర్తిచేశారు. బీజేపీ చేసిన అభివృద్ధి ఏం లేకే, ఓట్ల ‌కోసం హిందూ ‌ముస్లిం పేరుతో విద్వేశాలు రెచ్చగొడుతోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కరోనా కాలంలో పేద వారికి నెలకు రూ.1500 తో పాటు ఉచిత రేషన్ బియ్యం ‌అందించి ఆదుకున్నామని, కానీ బీజేపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా సాయం చేయలేదని గుర్తు చేశారు.

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామని, గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ ‌అభ్యర్థి‌ ముఠా పద్మ‌నరేష్ ను గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యేలు కృష్ణ మోహన్ రెడ్డి, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దయానంద్, పలువురు కార్పోరేషన్ చైర్మన్ లు, ఆర్య వైశ్య మహాసభ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -