ఎమ్మెల్యేను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత..

41
MLC Kalvakuntla Kavitha

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి అనారోగ్యంతో ఇటీవల స్వర్గస్తులైనారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం గణేశ్‌ గుప్తాను కలిసి పరామర్శించారు. ఎమ్మెల్యే బిగాల గణేష్ నివాసానికి వెళ్లి కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ సైతం ఎమ్మెల్యే గణేశ్‌గుప్తాను పరామర్శించి కృష్ణమూర్తి స్మారక వన నిర్మాణాన్ని ప్రారంభించిన విషయం తెలిసింది.