సీఎం కేసీఆర్ పై ఎవరూ పోటీ చేసినా ఓటమి ఖాయమన్నారు ఎమ్మెల్సీ కవిత. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌గా మాట్లాడిన కవిత…కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ నిలిపి వేశామని, కొందరు కావాలని రైతులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు…. పథకాల సృష్టికర్త కేసీఆర్ అన్నారు. కేసీఆర్ పై అమాయకత్వంతో పోటీ చేయాలనుకుంటున్నారని …ఒక్క కేసీఆర్ ను కొట్టడానికి ఎన్ని సమీకరణాలు మారుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు.
రైతులు, మహిళలను ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. మైనార్టీల ఓట్లు డివైడ్ కావడం వల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ కు ఎన్నికలు ఓ ఆటని వెల్లడించారు. మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా చూస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్, బీజేపీ తరహాలో అబద్ధాలు చెప్పడం మాకు రాదని చెప్పారు. తమ పథకాలు కాపీ కొట్టి కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అంటోందని ఎద్దేవా చేశారు. బీజేపీకి తెలంగాణలో స్కోప్ లేదని, ప్రజల్లో ఆ పార్టీకి విశ్వసనీయత లేదన్నారు.
Also Read:నాడు వలసల వనపర్తి…నేడు వరి పంటల వనపర్తి