టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి సీఎం కేసీఆర్ కు వీరాభిమాని గంగారెడ్డి… తన ఇంటి పేరును ‘కేసీఆర్’ గా మార్చుకున్న గంగారెడ్డి . సీఎం కేసీఆర్ గారిని అమితంగా అభిమానిస్తూ, తన ఇంటి పేరునే కేసీఆర్ గా మార్చుకున్న టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబ సభ్యురాలి పెళ్లికి హాజరయ్యారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన సీఎం కేసీఆర్ వీరాభిమాని, టీఆర్ఎస్ కార్యకర్త ‘కేసీఆర్ గంగారెడ్డి’ మనవరాలు వేద శ్రీ(దివ్య భారతి) – అనంత రెడ్డి ల వివాహానికి హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నవదంపతులను ఆశీర్వదించారు.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి సీఎం కేసీఆర్ గారి వెంట నడుస్తున్న గంగారెడ్డి, తెలంగాణ ఉద్యమంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో 2006, 2011 లో రెండు సార్లు సీఎం కేసీఆర్ గారు జగ్గాసాగర్ లో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. తమ గ్రామంలో సీఎం కేసీఆర్ పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహించే గంగారెడ్డి, చుట్టు పక్కల గ్రామాల్లో సైతం ‘కేసీఆర్ గంగారెడ్డి’ గానే సుపరిచితుడు. తమ మనవరాలి వివాహానికి, అభిమాన నాయకులు సీఎం కేసీఆర్ గారి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు హాజరవడం పట్ల గంగారెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.