మాజీ సీఎం కేసీఆర్‌ని కలిసిన ఎమ్మెల్సీ కవిత

10
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ రావడంతో నిన్న ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అడుగడుగునా కవితకు ఘనస్వాగతం లభించగా తాజాగా తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఆశీస్సుల కోసం ఎర్రవెల్లి నివాసానికి వచ్చారు కవిత. భర్త అనిల్‌, కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో ఆత్మీయ ఆహ్వానం లభించింది.

దిష్టి తీసి స్వాగతం పలికారు సిబ్బంది. కన్న బిడ్డను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు కేసీఆర్. అక్రమ నిర్బంధం నుంచి బయటకొచ్చిన బిడ్డను చూసి కేసీఆర్ కండ్లల్లో ఆత్మీయ ఆనందం కనబడింది. ఈ సందర్భంగా తన పాదాలకు నమస్కరించగా బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు కేసీఆర్.

Also Read:వైసీపీకి ,ఎంపీ పదవికి మోపిదేవి-మస్తాన్ రావు రాజీనామా

- Advertisement -